నారాయణపేట దుర్ఘటనలో మృతులంతా ఒకే గ్రామానికి చెందిన మహిళలు!
- కూలి పనుల కోసం వెళ్లి 10 మంది మృతి
- గుట్ట కింద సేద తీరుతుండగా ప్రమాదం
- గాయాలతో బయటపడిన లక్ష్మి
ఈ ఘటనలో సీహెచ్ లక్ష్మి అనే మరో మహిళ గాయాలతో బయటపడింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో, కె. లక్ష్మి (30), లక్ష్మి(28), బుడ్డమ్మ(26), పి. అనురాధ(30), మంగమ్మ(32), కేశమ్మ(38), అనంతమ్మ(45), బి. అనంతమ్మ(35), బి. లక్ష్మి(28), బీమమ్మ(40) ఉన్నారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.