ఈ వారంలోనే ఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్': రామ్ గోపాల్ వర్మ

  • రేపటితో పూర్తి కానున్న ఏపీ ఎన్నికల ప్రక్రియ
  • ఏపీ మినహా మిగతా ప్రాంతాల్లో గత నెలలోనే విడుదల
  • నేడు తీర్పివ్వనున్న హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ లో ఈ వారంలోనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదల అవుతుందని దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. కాగా, ఏపీ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రం గత నెల 29న విడుదలైన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఎన్నికలు రేపటితో ముగియనుండటంతో, ఆ వెంటనే సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ యూ దుర్గా ప్రసాదరావులతో కూడిన ధర్మాసనం తిలకించి తీర్పును ఇవ్వనుంది.



Go Back to Shorts
Lakshmi's NTR
Ramgopal Varma
High Court
Andhra Pradesh

More Telugu News