Chandrababu: ఈ విషయంపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదు?: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
వైఎస్ జగన్ తన మేనిఫెస్టోలో నదుల అనుసంధానం గురించి ఎందుకు ప్రస్తావించలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "నదుల అనుసంధానం గురించి వైఎస్ జగన్ ఎందుకు మాట్లాడలేదు? వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో పెట్టాలంటే కెసిఆర్ అనుమతి కావాలా? ఏపి నీటి హక్కులను కాపాడతానని చెప్పలేక పోయాడు. రాష్ట్ర ప్రయోజనాలను కెసిఆర్ కు తాకట్టు పెట్టాడు" అని మండిపడ్డారు. ఆపై "ఇప్పుడు ఎవరిని తొలగించి గ్రామాల్లో 10 మందిని పెడతానని జగన్ అంటున్నాడు..? గ్రామాల్లో వీఆర్ఏ, వీఆర్వో లను తొలగిస్తారా..? అంగన్ వాడిలను,ఆశావర్కర్లను తొలగిస్తారా..?" అని ప్రశ్నించారు.



Go Back to Shorts
Chandrababu
Jagan
KCR
Manifesto

More Telugu News