ఏపీలో ఈసారి జగన్ గెలవడం ఖాయం.. ఆయన ఎన్డీయేలోకి రావాలి!: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే
- ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధ్యం కాదు
- ఏపీకి ఇస్తే మిగతావారు కూడా కోరతారు
- మచిలీపట్నంలో కేంద్ర మంత్రి పర్యటన
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్డీయేలోకి చేరాలని జగన్ ను ఆహ్వానిస్తున్నట్లు రాందాస్ పిలుపునిచ్చారు. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.