ఆసక్తిని రేపుతోన్న 'రాక్షసుడు' ప్రీ లుక్ పోస్టర్
- బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'రాక్షసుడు'
- తమిళ 'రాచ్చసన్'కి రీమేక్
- రేపు రానున్న ఫస్టులుక్
గోడల నిండా పాత పేపర్ కటింగ్స్ అతికించబడి ఉండగా .. ఆ గది పైభాగం నుంచి ఒక బొమ్మ తల వేళ్లాడుతోంది. ముఖమంతా గాయాలు చేయబడి ఆ బొమ్మ తల భయంకరంగా కనిపిస్తోంది. ఓ రాక్షసుడి మనస్తత్వానికి ఆ గది అద్దం పడుతోంది. ఇక 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. తమిళంలో మాదిరిగానే తెలుగులోనూ ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.