ఈ ముగ్గురూ కలిసి ఏపీపై ముప్పేట దాడి చేస్తున్నారు: మంత్రి యనమల

  • మోదీకి కేసీఆర్, జగన్ లు కుడి, ఎడమ భుజాలు
  • జగన్ కు ఓటేస్తే ఏపీపై పెత్తనం కేసీఆర్ కు ఇచ్చినట్టే
  • బీజేపీ, వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదు
మోదీ, కేసీఆర్, జగన్.. ఈ ముగ్గురూ కలిసి ఏపీపై ముప్పేట దాడి చేస్తున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోదీకి కేసీఆర్, జగన్ లు కుడి, ఎడమ భుజాలతో సమానమని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటేస్తే ఏపీపై పెత్తనం కేసీఆర్ కు ఇచ్చినట్టే అని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేతలపై మోదీ దాడులు చేయిస్తున్నారని, ఈ కుట్రలకు బీజేపీ, వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం అంశాల అమలు చేయడం టీడీపీకే సాధ్యమని అన్నారు. 
Go Back to Shorts
Telugudesam
Yanamala
modi
jagan
kcr
TRS
cm

More Telugu News