జగన్ కంటే ఎక్కువ కేసులు ఉన్న వైసీపీ నేత ఈయనే!

  • 31 కేసులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్న జగన్
  • తాడిపత్రి అభ్యర్థి కేతిరెడ్డిపై 32 కేసులు
  • వీటిలో కొన్నింటిని కోర్టులు కొట్టివేశాయని అఫిడవిట్ లో తెలిపిన కేతిరెడ్డి
వైసీపీలో ఎక్కువ టికెట్లు నేర చరిత్ర ఉన్న వారికే ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్ లో వైసీపీ అధినేత జగన్ తనపై 31 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వైసీపీ తరపున పోటీ చేస్తున్న వారిలో అనేక మందికి పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. మరోవైపు, వైసీపీకి చెందిన ఓ అభ్యర్థి కేసుల్లో జగన్ ను కూడా మించిపోయారు. ఆయనే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి.

కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఏకంగా 32 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ కేసులు 1985 నుంచి 2019 వరకు నమోదై ఉన్నాయి. ఆయనపై పోలీసులు 1987లోనే రౌడీషీట్ తెరిచారు. తుపాకులు, బాంబులతో దాడి చేయడం, కిడ్నాప్, హత్యలు, ఆస్తులను నష్టపరచడం లాంటి కేసులు ఆయనపై ఉన్నాయి. ఈయనపై ఉన్న కేసుల్లో అత్యధికంగా యల్లనూరు పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. అయితే, వీటిలో కొన్ని కేసులను కోర్టులు కొట్టివేశాయని తన అఫిడవిట్ లో కేతిరెడ్డి తెలిపారు.
Go Back to Shorts
jagan
cases
affidavit
ketireddy pedda reddy
tadipatri
ysrcp

More Telugu News