Jagan: ఆడపడుచుల్లో చిరునవ్వు నిజమే... కారణం మాత్రం మీరనుకుంటున్నది కాదు చంద్రబాబూ: వైఎస్ జగన్

షార్ట్స్‌లో చూడండి
చంద్రబాబునాయుడు చెబుతున్నట్టుగా ఆడపడుచుల్లో చిరునవ్వు కనిపిస్తున్న మాట వాస్తవమేనని, అయితే, దానికి కారణం మాత్రం ఆయన అనుకుంటున్నది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, ఎన్నికలకు ముందు తానిచ్చిన మూడు వేలను చూసుకుని అక్కచెల్లెమ్మలు ఆనందిస్తున్నారని చంద్రబాబు అంటున్నారని, కానీ మరో వారం రోజుల్లో రాష్ట్రానికి పట్టిన పీడ పోతుందన్న ఆనందంలో వారున్నారని జగన్ అన్నారు.

"ఒక వారంలో చంద్రబాబునాయుడి ప్రభుత్వాన్ని మేము దించేస్తాము అన్న ఆనందం ఆ అక్కచెల్లెమ్మల ముఖాల్లో కనిపించింది. ఐదు సంవత్సరాల చంద్రబాబు మోసాలను, దుష్టపరిపాలనను ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ, ఈ ప్రభుత్వాన్ని దించబోతున్నామంటూ, మంచి రోజులు రాబోతున్నాయన్న ఆనందంలో రైతుల ముఖంలో ఆనందం కనిపిస్తావుంది. మహిళల ముఖంలో ఆనందం కనిపిస్తావుంది. నిరుద్యోగుల ముఖాల్లో ఆనందం కనిపిస్తావుంది. ఉద్యోగుల ముఖంలో ఆనందం కనిపిస్తావుంది. చిన్న చిన్న వ్యాపారుల ముఖంలో ఆనందం కనిపిస్తావుంది. ప్రతి ఒక్కరి ముఖంలోనూ చిరునవ్వులు కనిపిస్తున్నాయని చెబుతూ ఉన్నా" అని అన్నారు.
Go Back to Shorts
Jagan
Chandrababu
Andhra Pradesh
Campaign

More Telugu News