sensex: చరిత్ర సృష్టించిన సెన్సెక్స్.. కొనసాగుతున్న లాభాల జోరు

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీనికి తోడు అంతర్జాతీయంగా కూడా సానుకూలతలు ఉండటం కలసి వచ్చింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ చరిత్ర సృష్టించింది. చరిత్రలో తొలిసారి 39వేల మార్కును అధిగమించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్లు పెరిగి 39,057కి చేరుకుంది. నిఫ్టీ 44 పాయింట్లు పుంజుకుని 11,713కు ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (8.36%),  భారతి ఎయిర్ టెల్ (5.08%), టీసీఎస్ (2.37%), బజాజ్ ఫైనాన్స్ (2.25%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.12%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఆటో (-2.14%), సన్ ఫార్మా (-1.92%), వేదాంత (-0.71%), టాటా స్టీల్ (-0.67%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.55%).
Go Back to Shorts
sensex
nifty
stock market

More Telugu News