ప్రధాని పదవికి అర్హుల జాబితాను రూపొందిస్తే అందులో కేసీఆర్ పేరు కచ్చితంగా ఉంటుంది: అసదుద్దీన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రధాని పదవికి అర్హుల జాబితాను రూపొందిస్తే అందులో కేసీఆర్ పేరు కచ్చితంగా ఉంటుంది: అసదుద్దీన్

  • ప్రధాని పదవికి నేను కేసీఆర్‌ను ఎన్నుకుంటా
  • కేసీఆర్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా
  • భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్న నేత కేసీఆర్
ప్రధాని పదవికి అర్హుల జాబితాను రూపొందిస్తే అందులో కేసీఆర్ పేరు కచ్చితంగా ఉంటుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోదీ, రాహుల్, కేసీఆర్ ముగ్గురిలో ప్రధాని పదవికి ఒకరిని ఎన్నుకోమంటే తాను కేసీఆర్‌ను ఎన్నుకుంటానని తెలిపారు.

ఎన్నికల తరువాత ప్రాంతీయ పార్టీలే అధికారాన్ని చేపడతాయన్న కేసీఆర్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. ఒకే నాణేనికి రెండు ముఖాల వంటివి, బీజేపీ, కాంగ్రెస్ అని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు పరిపాలనా కాలంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని బాగా అర్థం చేసుకున్న నేతగా కేసీఆర్‌ను అభివర్ణించారు.
KCR
Asaduddin Owaisi
Narendra Modi
Rahul Gandhi
BJP
Congress

More Telugu News