కేటీఆర్, హరీశ్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన సునీతా లక్ష్మారెడ్డి
- మెదక్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేసిన సునీత
- ఇటీవలే కేటీఆర్‌ను కలిసి వెల్లడి
- అనూహ్యంగా నేడు పార్టీలో చేరిన సునీత
ఇటీవలే కేటీఆర్‌ను కలిసిన సునీతా లక్ష్మారెడ్డి తాను టీఆర్ఎస్‌లో చేరాలనుకుంటున్నట్టు తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ సభ జరగనుంది. ఈ సందర్భంగా సునీతా గులాబీ గూటికి చేరుతారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా నేడే ఆ పార్టీలో చేరి అందరికీ షాక్ ఇచ్చారు.