sensex: మార్కెట్లలో కొనసాగుతున్న జోరు

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. మెటల్, ఐటీ, ఆటో, టెలికాం సూచీల అండతో వరుసగా మూడో రోజు లాభాలను కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 199 పాయింట్ల లాభంతో 38,872కు పెరిగింది. నిఫ్టీ 45 పాయింట్లు పుంజుకుని 11,669 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (7.37%), వేదాంత (2.86%), భారతీ ఎయిర్ టెల్ (2.73%), టాటా స్టీల్ (2.66%), మారుతి సుజుకీ (2.57%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.22%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.66%), యాక్సిస్ బ్యాంక్ (-1.42%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.26%), హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (-1.21%).
Go Back to Shorts
sensex
nifty
stock market

More Telugu News