'సీత' విడుదల తేదీ వాయిదా పడే అవకాశం?
- 'సీత'గా కనిపించనున్న కాజల్
- ప్రతినాయకుడిగా సోనూ సూద్
- సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాను, ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం సందేహమే అనే మాట ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. కొన్ని కారణాల వలన విడుదల తేదీని వాయిదా వేసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి వుంది. విలన్ గా సోనూ సూద్ నటించిన ఈ సినిమాకి, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు.