Jagan: ఇవాళ జగన్ నామినేషన్ కు సర్వం సిద్ధం... పులివెందులలో కోలాహలం

షార్ట్స్‌లో చూడండి
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జగన్ ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు పులివెందుల చేరుకోనున్న జగన్ మొదట భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పులివెందులలో రిటర్నింగ్ అధికారికి మధ్యాహ్నం 1.40 నుంచి 1.49 నిమిషాల మధ్యలో జగన్ నామినేషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. జగన్ నామినేషన్ నేపథ్యంలో పులివెందులలో భారీగా కోలాహలం కనిపిస్తోంది.
Go Back to Shorts
Jagan
YSRCP

More Telugu News