నాడు ‘కాంగ్రెస్’కు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ నేడు వైసీపీకి ఇద్దాం: సీఎం చంద్రబాబు
- 2014లో ‘కాంగ్రెస్’కు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాం
- వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి
- ఆ పార్టీ నేతలకు డిపాజిట్లు రాకుండా చేయాలి
విభజన చట్టంలో మనకు అన్యాయం చేసిన వ్యక్తి, ఆంధ్ర ప్రజలను అనునిత్యం అవమానించే వ్యక్తి, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వ్యక్తికి జగన్ లొంగిపోయారని విమర్శించారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ ఈ రోజున వైసీపీకి ఇవ్వాలా? వద్దా? అని ఏపీ ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని, ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని ఏపీ ఓటర్లకు పిలుపు నిచ్చారు.