sensex: కొనసాగుతున్న బుల్ జోరు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
దేశీయ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. రూపాయి విలువ పెరగడంతో పాటు విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 71 పాయింట్లు పెరిగి 38,095కు ఎగబాకింది. నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 11,462 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.84%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.29%), యాక్సిస్ బ్యాంక్ (2.21%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.89%), టాటా స్టీల్ (1.77%).

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-2.56%), హీరో మోటో కార్ప్ (-2.47%), భారతి ఎయిర్ టెల్ (-2.08%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.51%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.34%), ఎల్ అండ్ టీ (-1.32%).         
Go Back to Shorts
sensex
nifty
stock market

More Telugu News