కేసీఆర్ తో కుమ్మక్కై ఏపీని ఎడారిగా మారుస్తావా?: జగన్ పై చంద్రబాబు నిప్పులు
- పోలవరం ప్రాజెక్టును టీఆర్ఎస్ అడ్డుకుంటోంది
- అలాంటి పార్టీ చీఫ్ కేసీఆర్ తో జగన్ దోస్తీ చేస్తున్నారు
- ఓటమి భయంతో జగన్ సైకో గేమ్ ఆడుతున్నారు
వైసీపీని బజారులో పెట్టి టికెట్లు అమ్ముకుంటున్నారనీ, ఎవరు ఎక్కువ కప్పం చెల్లిస్తే వారికే టికెట్లు ఇస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ-బీజేపీ కుమ్మక్కును ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ‘కేసీఆర్ తో కుమ్మక్కు అయి ఏపీని ఎడారిగా మారుస్తావా.. కేసీఆర్ ఇచ్చే కోట్ల కోసం ఏపీని టీఆర్ఎస్ కు అమ్మేస్తావా?’ అని జగన్ ను ప్రశ్నించారు.