Krishna District: గేదెను అమ్మే విషయంలో తలెత్తిన గొడవ.. గొడ్డలితో భార్య కాళ్లను నరికేసిన భర్త

షార్ట్స్‌లో చూడండి
చిన్న విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ.. చిలికి చిలికి గాలివానగా మారి చివరకు భార్య కాళ్లు నరికే వరకూ వెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాలోని లింగాలపాడు గ్రామంలో జి. పిచ్చయ్య, రాజేశ్వరి దంపతులు నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి పిచ్చయ్య ఇంటికి రాగానే భార్యాభర్తల మధ్య గేదెను అమ్మే విషయంలో వివాదం జరిగింది.

అది కాస్తా తీవ్ర రూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన పిచ్చయ్య గొడ్డలితో రాజేశ్వరి కాళ్లను నరికేశాడు. బాధితురాలు ప్రస్తుతం నందిగామలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే తమ తల్లిదండ్రులిద్దరూ ఎప్పుడూ సఖ్యతతో లేరని.. ఇద్దరి మధ్య ఎప్పుడూ ఏవో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయని వారి కుమార్తె తెలిపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Krishna District
Lingalapadu
Pitchaiah
Rajeswari
Nandigama

More Telugu News