Andhra Pradesh: తిరుపతి నుంచి టీడీపీ ఎన్నికల శంఖారావం?

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటన వెలువడ్డ నేపథ్యంలో టీడీపీ ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతోంది. తిరుపతి నుంచి టీడీపీ ఎన్నికల శంఖారావం పూరించనున్నట్టు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని తెలుస్తోంది. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, రేపు సాయంత్రం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను టీడీపీ బృందం కలవనుంది. ఫారం-7, డేటా చోరీ అంశాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఈసీని కలవనున్న ఈ బృందంలో మంత్రులు నక్కా ఆనంద్ బాబు, కాలవ శ్రీనివాసులు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
tirupathi
Chandrababu
Telugudesam

More Telugu News