180 మదర్సాలను నియంత్రణలోకి తీసుకున్నాం.. 121 మందిని అరెస్ట్ చేశాం: పాకిస్థాన్
- నిషేధిత సంస్థలకు చెందిన వారిని అరెస్ట్ చేశాం
- దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే ఈ చర్యలు
- భారత్ ఆగ్రహం వ్యక్తం చేసిందన్న కారణంతో కాదు
మదర్సాల విషయంలో ఏం చేయాలనేది పాకిస్థాన్ లో ఇప్పుడు ఒక సవాల్ గా పరిణమించింది. యువతలో రాడికల్ భావజాలాన్ని మదర్సాలు నింపుతున్నాయనే ఆరోపణలు ఇటీవలి కాలంలో ఆ దేశంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరోవైపు పేద దేశమైన పాక్ లో లక్షలాది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నది కూడా మదర్సాలే.