Andhra Pradesh: క్రైమ్ కి కేరాఫ్‌ అడ్రస్ జగన్: నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
డేటా చోరీ కేసులో నిందితులు చంద్రబాబు, లోకేశ్ లేనని వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను లోకేశ్ తిప్పికొడుతూ వరుస ట్వీట్లు చేశారు. క్రైమ్ కి కేరాఫ్‌ అడ్రస్ జగనే అని, సైబ‌రాబాద్ నిర్మించ‌డం చంద్ర‌బాబుకి తెలుసని, సైబ‌ర్ క్రైమ్ చేయ‌డం జగన్ కు మాత్ర‌మే తెలుసని విమర్శించారు. ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షా ప‌త్రాలు ఎత్తుకెళ్లిందీ జగనే అని, ల‌క్ష‌ల కోట్ల ప్ర‌జాధ‌నం లూటీ చేసిందీ జగనే అని, టీడీపీ డేటా చోరీ చేసిందీ కూడా జగనే అంటూ ఆరోపించారు. నేరాల్లో, ఘోరాల్లో, చోరీల్లో జగన్ కు జగనే సాటి అని, ఆయన ర్యాంకు ‘ఎ1’ అని వ్యాఖ్యానించారు.


Go Back to Shorts
Andhra Pradesh
Telangana
lokesh
Jagan

More Telugu News