కౌశల్ తీరును దుయ్యబడుతూ కౌశల్ ఆర్మీ తిరుగుబాటు సాంగ్
- కౌశల్ ఆర్మీ ఆరోపణలు
- ఖండిస్తూ వస్తోన్న కౌశల్
- ఏకంగా సాంగ్ రిలీజ్
"అందరూ గొర్రెలే .. " అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నై కి చెందిన అరవింద్ అనే వ్యక్తి ఈ పాటను విడుదల చేశాడు. కౌశల్ ఆర్మీ పేరుతో తామంతా భజనలు చేసి .. గొర్రెలం అయ్యాము అనే అర్థంలో ఈ పాట వుంది. 'అన్న అనుకుంటే పీఎమ్ కాల్ వస్తది .. సీఎం సీటు వస్తది .. టెన్త్ పాస్ కాకున్నా డాక్టరేట్ వస్తది' అనే వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ రాసిన ఈ పాటపై కౌశల్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.