కసురుకున్న భర్త.. ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న యువతి!
Add ap7am to your home Screen

కసురుకున్న భర్త.. ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న యువతి!

  • హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఘటన
  • 6 నెలల క్రితం నివేదితకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో వివాహం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్మరణం
పెళ్లయిన 6 నెలలకే ఆమెకు నూరేళ్లు నిండాయి. అత్తవారింట్లో కలహాలు, భర్త కోపగించుకోవడంతో మనస్తాపానికి లోనయిన యువతి అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్న వనస్థలిపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

స్థానిక సుష్మసాయినగర్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ 6 నెలల క్రితం నివేదిత అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇక్కడే ఓ అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో వీరిద్దరూ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. అయితే ఇటీవల వీరి కుటుంబంలో కలహాలు చెలరేగాయి. భర్త కూడా నివేదితపై కొప్పడ్డాడు. దీంతో యువతి మనస్తాపానికి లోనయింది.

ఈరోజు ఉదయం అపార్ట్ మెంట్ ఐదో అంతస్తుకు చేరుకుంది. అక్కడి నుంచి ఒక్కసారిగా కిందకు దూకేసింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana
Hyderabad
suicide

More Telugu News