'యాత్ర' దర్శకుడికి మాటిచ్చేసిన దుల్కర్ సల్మాన్
- దుల్కర్ కి యూత్ లో క్రేజ్
- 'యాత్ర' చూసి దర్శకుడికి అభినందనలు
- తన కోసం కథ రెడీ చేయమన్న దుల్కర్
ఈ సినిమా చూసిన వెంటనే ఆయన మహి.వి రాఘవ్ కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశాడని సమాచారం. అంతేకాదు .. మంచి కథను సిద్ధం చేయండి .. తెలుగులో చేయడానికి నేను సిద్ధం అని చెప్పాడట. మలయాళ .. తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో దుల్కర్ కి మంచి క్రేజ్ వుంది. అలాంటి స్టార్ హీరో చుట్టూ కథ పట్టుకు తిరిగితే పని జరగడమే కష్టం. అలాంటిది ఆయనే చేస్తానని మాట ఇవ్వడం మరింత విశేషం. ఈ అవకాశాన్ని మహి.వి రాఘవ్ ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.