భారత్‌కు విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ కెనడా
- భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో నిర్ణయం
- తమ గగన తలాన్ని మూసేసిన పాక్
- మార్గమధ్యంలోనే వెనుదిరిగిన టొరొంటో-ఢిల్లీ విమానం
దీంతో చాలా వరకు అంతర్జాతీయ విమానాలు దారి మళ్లాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా టొరొంటో నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ కెనడా విమానం మార్గమధ్యంలోనే తిరిగి కెనడాకు మళ్లింది. వాంకోవర్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని రద్దు చేసింది. ఇది తాత్కాలిక నిర్ణయం మాత్రమేనని, పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి విమాన సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని ఎయిర్ కెనడా స్పష్టం చేసింది.