ఆస్కార్ సంబరాలకు సర్వం సిద్ధం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆస్కార్ సంబరాలకు సర్వం సిద్ధం!

  • ఫిబ్రవరి 25న అవార్డుల పండగ
  • ఉత్తమ చిత్రం రేసులో 8 సినిమాలు
  • ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ
సినిమా రంగంలో ఆస్కార్ (అకాడమీ) కు ఉన్నంత విశిష్టత మరే పురస్కారానికి లేదంటూ అతిశయోక్తి కాదు. హాలీవుడ్ సినిమా పండగగా అభివర్ణించే ఆస్కార్ అవార్డుల కోసం ప్రపంచ దేశాలన్నీ అమితమైన ఆసక్తితో ఎదురుచూస్తుంటాయి. జీవితంలో ఒక్కసారన్నా ఆస్కార్ అవార్డు అందుకుంటే ఇంక సాధించాల్సిందేమీ ఉండదని సినీ ప్రముఖులు భావిస్తుంటారు.

సినీ అవార్డుల్లో ఎవరెస్ట్ లాంటి ఆస్కార్ పురస్కారోత్సవం ఇప్పుడు మళ్లీ వచ్చింది. భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 25 ఉదయం 91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. ఈ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ప్రతి ఏటా హాలీవుడ్ లో ప్రదానం చేస్తుంది. ఈసారి ఉత్తమచిత్రం రేసులో బ్లాక్ పాంథర్, వైస్, రోమా, బొహేమియన్ రాప్సొడీ, ఏ స్టార్ ఈజ్ బోర్న్ తదితర చిత్రాలు నిలిచాయి. ఉత్తమ నటుడి అవార్డు కోసం క్రిస్టియన్ బేల్, బ్రాడ్లీ కూపర్, విలెమ్ డాఫో, రామి మాలెక్, విగ్గో మార్టెన్సమ్ పోటీపడుతున్నారు.  హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్ ఈసారి అవార్డుల కార్యక్రమానికి వేదికగా నిలుస్తోంది. మొత్తం 24 కేటగిరీల్లో 52 సినిమాలు బరిలో నిలిచాయి.

USA

More Telugu News