థ్రిల్లర్ నేపథ్యంలో సాగే 'నరకాసురుడు' .. ఫస్టులుక్ రిలీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

థ్రిల్లర్ నేపథ్యంలో సాగే 'నరకాసురుడు' .. ఫస్టులుక్ రిలీజ్

  • థ్రిల్లర్ నేపథ్యంగా 'నరకాసురుడు'
  • ప్రధాన పాత్రలో అరవింద్ స్వామి
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  
తమిళంలో కార్తీక్ నరేన్ దర్శకత్వంలో 'నరగాసురన్' రూపొందింది. అరవింద్ స్వామి .. శ్రియ .. సందీప్ కిషన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను వేసవిలో విడుదల చేయనున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి తెలుగులో 'నరకాసురుడు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా తెలుగు వెర్షన్ కి సంబంధించిన ఫస్టులుక్ ను విడుదల చేశారు.

సినిమాపై ఆసక్తి కలిగేలా ఫస్టుపోస్టర్ ను డిజైన్ చేశారు. ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. గతంలో కార్తీక్ నరేన్ దర్శకత్వంలో వచ్చిన 'ధృవంగళ్ పతినారు' సినిమా తమిళంలో ఘన విజయాన్ని అందుకుంది. తెలుగులో '16' పేరుతో విడుదలై వైవిధ్యభరితమైన చిత్రంగా మంచి మార్కులు కొట్టేసింది. అందువలన తెలుగులో విడుదలవుతోన్న 'నరకాసురుడు'పై అందరిలోను ఆసక్తి వుంది. 
aravind swami
sundeep kishan
shriya

More Telugu News