తన సినిమా యూనిట్ కి కానుకలు అందజేసిన నయనతార
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన సినిమా యూనిట్ కి కానుకలు అందజేసిన నయనతార

  • తమిళంలో 'మిస్టర్ లోకల్'
  • హీరోగా శివకార్తికేయన్ 
  • ప్రశంసలు కురిపిస్తోన్న యూనిట్ సభ్యులు      
నయనతారకి తమిళంలో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా తమిళంలో ఆమె చేసిన 'విశ్వాసం' ఘన విజయాన్ని సాధించి, ఆమె క్రేజ్ ను మరోమారు నిరూపించింది. ప్రస్తుతం ఆమె శివకార్తికేయన్ జోడీగా 'మిస్టర్ లోకల్' సినిమాను చేస్తోంది. దర్శకుడు రాజేశ్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. రీసెంట్ గా నయనతారకి సంబంధించిన పోర్షన్ అయిపోయిందట.

దాంతో చివరి రోజున ఆమె యూనిట్ సభ్యుల సమక్షంలో సెట్లో కేక్ కట్ చేసి, వాళ్లందరికీ 'ఫాసిల్' కంపెనీ వాచ్ లను కానుకగా ఇచ్చిందట. దాంతో యూనిట్ సభ్యులంతా ఆమె మంచితనాన్ని ప్రశంసిస్తున్నారు. నయనతార ప్రతి సెట్లోను అందరితోను చాలా కలుపుగోలుగా ఉంటుందనీ, తన షూటింగు చివరి రోజున యూనిట్ సభ్యులకి గిఫ్టులు ఇవ్వడం ఆమెకి అలవాటేనని అంటున్నారు. ఇక నయనతార ప్రస్తుతం తెలుగులో 'సైరా' .. తమిళంలో 'మైఖేల్' వంటి భారీ సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. 
nayanatara
shiva karthikeyan

More Telugu News