ఈ రోజున నేను ఈ స్థాయికి రావడానికి ఆమెనే కారణం: కమెడియన్ అలీ
- నా రెండవ సినిమా 'దేవుడు మావయ్య'
- నా కోసం ఈ షోకి వచ్చారు
- ఓ కొడుకులా నన్ను చూసుకున్నారు
ఈ వేదికపై అలీ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "నా కోసం .. నా షో కోసం 22 సంవత్సరాల తరువాత విజయలలిత గారు మేకప్ వేసుకున్నారు. నాకు సినిమా జన్మనిచ్చింది ఈ తల్లే. నా రెండవ సినిమా 'దేవుడు మామయ్య'కి ఆమెనే నిర్మాత. మాకు కబురు చేస్తే మా నాన్న నన్ను వెంటబెట్టుకుని చెన్నై తీసుకెళ్లాడు. సినిమా అయ్యేంతవరకూ నాకు వాళ్లింట్లో ఆశ్రయమిచ్చి కన్న కొడుకుకన్నా ఎక్కువగా చూసుకున్నారు. ఇంతవరకూ 1100 సినిమాలను పూర్తి చేసి నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉండటానికి ఆమెనే కారణం" అని చెప్పుకొచ్చాడు.