బాలకృష్ణగారు నాకు వార్నింగ్ ఇచ్చారనడంలో నిజం లేదు: హైపర్ ఆది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలకృష్ణగారు నాకు వార్నింగ్ ఇచ్చారనడంలో నిజం లేదు: హైపర్ ఆది

  • 'జబర్దస్త్'తో పాప్యులర్
  • అలాంటి స్కిట్ ఏదీ నేను చేయలేదు
  •  రామారావుగారి ఫాన్స్ నుంచి ఫోన్ వచ్చింది  
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన హైపర్ ఆది, ఇప్పుడు బాగా బిజీ అయ్యాడు. ఒక వైపు 'జబర్దస్త్' చేస్తూనే మరో వైపున సినిమాలు కూడా చేస్తున్నాడు. పవన్ 'జనసేన' తరఫున ప్రచారాల్లో సైతం పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక వార్త షికారు చేస్తోంది. ఒక స్కిట్ విషయంలో హైపర్ ఆదికి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారనేది ఆ వార్త సారాంశం. బాలకృష్ణ ఫోన్ చేసి మరీ క్లాస్ తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు.

ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో హైపర్ ఆది స్పందించాడు. బాలకృష్ణ గారు నన్ను మందలించారనే వార్తలో ఎంతమాత్రం నిజంలేదు. ఆయనకి అసహనాన్ని కలిగించే స్కిట్ ఏదీ నేను చేయలేదు. 'అదిరే అభి' టీమ్ లో ఆ మధ్య ఒకరు ఎన్టీఆర్ గెటప్ వేశారు. ఆ విషయంలో ఎన్టీ రామారావుగారి అభిమానుల నుంచి ఎవరో ఫోన్ చేసి చిన్న వార్నింగ్ ఇచ్చారు. ఆ విషయాన్ని ఒక చోట నేను ప్రస్తావించడం వలన, అది నాకు ఆపాదించబడింది ..అంతే" అని చెప్పుకొచ్చాడు. 
hyper adi

More Telugu News