Jayaram: జయరాం హత్యకు సైనైడ్ వాడినట్టు అనుమానం.. సూత్రధారి శిఖా చౌదరి!

  • శిఖా చౌదరి పేరిట ఆస్తుల బదలాయింపు
  • డాక్యుమెంట్లు తన వద్దే ఉంచుకున్న జయరాం
  • రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం

కోస్టల్ బ్యాంకు చైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో సూత్రధారిగా శిఖా చౌదరిని పోలీసులు గుర్తించారు. ఆమెకు సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతోంది. శిఖా చౌదరి పేరిట ఆస్తులు బదలాయించిన జయరాం.. డాక్యుమెంట్లు మాత్రం తన దగ్గరే ఉంచుకున్నట్టు వెల్లడైంది. ఈ డాక్యుమెంట్ల కోసమే తన స్నేహితులతో కలిసి శిఖా చౌదరి హత్యకు ప్లాన్ చేసినట్టు అనుమానిస్తున్నారు.

జయరాం హత్యకు సైనైడ్ వాడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో చంపి నందిగామ వద్ద రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న శిఖా చౌదరి స్నేహితుడు రాకేశ్, డ్రైవర్‌ను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. అయితే హత్య జరిగిన రోజు జయరాం కారులో తెల్ల చొక్కా వ్యక్తి, మహిళ ఉన్నట్టు గుర్తించారు. అయితే ఆ మహిళ శిఖ చౌదరా? లేదంటే వేరొకరా? అనే విషయమై విచారణ కొనసాగుతోంది.

More Telugu News