ప్రసాద్ ఐమాక్స్ పై వాణిజ్య పన్నుల శాఖ చర్యలు!
- అధిక ధరలను వసూలు చేస్తున్నారని ఫిర్యాదు
- దాడులు చేసిన యాంటీ ప్రాఫిటరింగ్ బృందం
- అధిక జీఎస్టీ వసూలు చేస్తున్నారని నిర్ధారణ
దీంతో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కె.వినయ్ కుమార్ నేతృత్వంలోని యాంటీ ప్రాఫిటరింగ్ బృందం తనిఖీలు జరిపి, అధిక జీఎస్టీ వసూలు నిజమేనని తేల్చింది. దీంతో విషయాన్ని రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తున్నామని, ఐమాక్స్ పై చర్యలకు సిఫార్సు చేశామని ఆయన అన్నారు. కాగా, తాజా బడ్జెట్ లో సినిమాలపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించిన నేపథ్యంలో, టికెట్ల ధరలు మరింతగా తగ్గాల్సివుంది.