వివిధ పదవులకు కవిత రాజీనామా!
- సింగరేణి కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా కవిత
- దానితో పాటు పలు సంఘాల పదవులకూ రిజైన్
- పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నందున నిర్ణయం
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటం, తిరిగి నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేయనున్న నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె పలు సంఘాలకు గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సంఘాల కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ప్రజా సంక్షేమం, సొంత నియోజకవర్గానికి అధిక సమయం కేటాయించలేకపోతున్నానన్న ఉద్దేశంతో కవిత పదవులకు రాజీనామా చేశారు. కాగా, హరీశ్ రావు సైతం ఇటీవల టీఎంయూ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.