విశాఖపట్నం శారదా పీఠం నుంచి కేసీఆర్ కు ఆహ్వానం!
- ఫిబ్రవరి 14న అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ
- హాజరు కావాలని తెలంగాణ సీఎంకు ఆహ్వానం
- అదే రోజు జగన్ గృహ ప్రవేశం కూడా!
కాగా, 14వ తేదీన మంచి ముహూర్తం ఉండటంతో వైకాపా అధినేత వైఎస్ జగన్ సైతం తన నూతన గృహప్రవేశం చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రావాలని కూడా కేసీఆర్ కు ఆహ్వానం అందింది. దీంతో కేసీఆర్ మరోసారి ఏపీలో పర్యటించి రెండు కార్యక్రమాలకూ హాజరవుతారా? అన్న విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.