అఖిలపక్ష సమావేశంపై ఉండవల్లి లేఖపై స్పందించిన చంద్రబాబు
- విజయవాడలో రేపు ఉండవల్లి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
- సమావేశానికి హాజరవుతామని చెప్పిన చంద్రబాబు
- టీడీపీతో కలిసి ఒకే వేదికను పంచుకోలేమన్న వైసీపీ
ఈ లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఉండవల్లి నిర్వహిస్తున్న సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ భేటీకి ఎంపీ సీఎం రమేష్, మంత్రి నక్కా ఆనందబాబులు హాజరవుతారని చెప్పారు.
మరోవైపు, ఈ భేటీకి హాజరుకాలేమని వైసీపీ ప్రకటించింది. టీడీపీతో కలసి ఒకే వేదికను పంచుకోలేమని తమకు వైసీపీ నాయకత్వం తెలిపిందని ఉండవల్లి చెప్పారు. మిగిలిన పార్టీలన్నీ హాజరుకానున్నాయని తెలిపారు.