నేడు గుంటూరులో పవన్ టూర్.. సాయంత్రం 5 గంటలకు ‘సమర శంఖారావం’ బహిరంగ సభ!
- ఏర్పాట్లు పూర్తిచేసిన జనసేన శ్రేణులు
- లూథరన్ పాఠశాల మైదానంలో వేదిక
- గుంటూరు ఆఫీసును ప్రారంభించనున్న జనసేనాని
జనసేన సభకు భారీ సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి తొక్కిసలాటలు చోటుచేసుకోకుండా 600 మంది జనసేన వాలంటీర్లను రంగంలోకి దించారు. ఈరోజు సాయంత్రం 3 గంటలకు జనసేన పార్టీ గుంటూరు ఆఫీసును పవన్ ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి 4 గంటలకు బయలుదేరి సభావేదిక వద్దకు ర్యాలీగా చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం అవుతుంది.