హేమమాలిని లైవ్ పెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిన సుష్మా స్వరాజ్!
- వారణాసిలో ప్రారంభమైన ప్రవాస భారతీయ దివస్
- సాంస్కృతిక కార్యక్రమాల్లో 'మా గంగా'
- నది పుట్టుక, కలుషితమవుతున్న తీరును కళ్లముందుంచిన హేమమాలిని
- అద్భుత ప్రదర్శనని కొనియాడిన సుష్మా స్వరాజ్
గంగా నది చరిత్రను ఆమె తన కళ్లముందుంచారని, నది ఎలా కలుషితం అవుతుందన్న అంశాన్ని చక్కగా చూపించారని కొనియాడారు. ఆమె లైవ్ పెర్ఫార్మెన్స్ చూసిన తరువాత, తనకు మాటలు రావడం లేదని, ఇంత అద్భుత ప్రదర్శనను తాను తొలిసారిగా చూస్తున్నానని అన్నారు. ఊహించలేనంత అద్భుత ప్రదర్శనను ఆమె ఇచ్చారని అన్నారు.
కాగా, ఈ నృత్యాన్ని అసిత్ దేశాయ్, ఆయన కుమారుడు అలాప్ దేశాయ్ కంపోజ్ చేయగా, పాటలను సురేష్ వాడేకర్, కవితా కృష్ణమూర్తి, శంకర్ మహదేవన్, మీకాసింగ్ లు పాడారు. నీతాలుల్లా డిజైన్ చేసిన దుస్తులతో హేమమాలిని మెరిసిపోగా, విభోరీ ఖండేల్ వాల్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆహూతులను అలరించాయి.