Srikakulam District: ప్రియుడే యముడయ్యాడు.. వివాహేతర సంబంధం మిగిల్చిన విషాదం!

షార్ట్స్‌లో చూడండి
తన భర్త దుబాయ్ లో ఉండగా, వివాహేతర సంబంధం పెట్టుకుని, ప్రియుడికి సర్వస్వాన్ని అప్పగించిన ఓ గృహిణి అతని చేతుల్లోనే బలై, తన ఇద్దరు పిల్లలనూ అనాధలను చేసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బలరాంపురం గ్రామానికి చెందిన కుశుమన్న, లక్ష్మిలకు 15 సంవత్సరాల క్రితం వివాహం కాగా, వారికి ఓ బాబు, ఓ పాప ఉన్నారు.

తాపీ పని చేసుకునే కుశుమన్న, ఉపాధిని వెతుక్కుంటూ దుబాయ్ వెళ్లగా, గ్రామంలో ఉండే సంపతిరావు భాస్కరరావుతో లక్ష్మి వివాహేతర బంధం పెట్టుకుంది. ఇటీవల భాస్కరరావుకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో లక్ష్మి అతనితో గొడవ పడింది. ఈ క్రమంలో ఆమెను వదిలించుకోవాలని భావించిన అతను ఆమెను బయటకు తీసుకెళ్లి చంపేసి, మృతదేహాన్ని దహనం చేశాడు. తన చెల్లెలు ఈ నెల 9వ తేదీ నుంచి కనిపించడం లేదని లక్ష్మి సోదరుడు అప్పన్న ఫిర్యాదు చేయడం, తమకు భాస్కరరావుపై అనుమానం ఉందని చెప్పడంతో, పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారించగా, నేరాన్ని అంగీకరించారు. 
Go Back to Shorts
Srikakulam District
Lover
Murder

More Telugu News