ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైన లగడపాటి రాజగోపాల్!

పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో ముఖ్యమంత్రిని ఆయన కలుసుకున్నారు. అనంతరం ఈ నెల 27న తమ కుటుంబంలో జరగనున్న ఓ శుభకార్యానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆయన ఆహ్వానించారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబంలో జరిగే శుభకార్యం కోసం సీఎంను ఆహ్వానించేందుకే వచ్చానని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ పై తాను ఇప్పుడేమీ వ్యాఖ్యానించబోనని స్పష్టం చేశారు. అనంతరం తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం పాలవుతుందని తన సర్వేలో తేలినట్లు లగడపాటి రాజగోపాల్ అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గానూ టీఆర్ఎస్ 88 సీట్లు దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
lagadapati
federal front
Telangana
KCR
TRS

More Telugu News