Chandrababu: టీడీపీలో చేరిన మాజీ మంత్రి అహ్మదుల్లా.. పార్టీలో చేరిన వెంటనే ఆయన కుమారుడికి కీలక బాధ్యతలు

షార్ట్స్‌లో చూడండి
కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అహ్మదుల్లా, ఆయన కుమారుడు అష్రఫ్, సత్యవీడుకు చెందిన జేడీ రాజశేఖర్‌లు పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ తరపున మంత్రిగా పనిచేసిన అహ్మదుల్లా 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రాజకీయాల్లో తిరిగి క్రియాశీలం కావాలనుకున్న ఆయన తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రానున్న ఎన్నికల్లో అహ్మదుల్లా కడప అసెంబ్లీ సీటును ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అహ్మదుల్లా పార్టీలో చేరిన వెంటనే ఆయన కుమారుడు అష్రఫ్‌కు కడప టీడీపీ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
Go Back to Shorts
Chandrababu
Kadapa District
Ahmdullah
Telugudesam
Andhra Pradesh

More Telugu News