టీఆర్ఎస్ జెండా 33 దేశాల్లో ఎగురుతోంది.. త్వరలోనే ఎన్నారై పాలసీ తీసుకొస్తాం!: కల్వకుంట్ల కవిత
- టీఆర్ఎస్ ఎన్నారై శాఖపై వెనక్కు తగ్గం
- తెలంగాణ భవన్ లో యూకే సెల్ 8వ వార్షికోత్సవ వేడుకలు
- ఎన్నారై పాలసీపై కేటీఆర్ పనిచేస్తున్నారన్న కవిత
అనంతరం మాట్లాడుతూ.. ఎన్నారై విధానంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ఎన్నారై శాఖతో కలిసి త్వరలోనే ఎన్నారై విధానాన్ని తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, యూకే సెల్ అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం తదితరులు పాల్గొన్నారు.