Tamilnadu: రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుల మృతిపై హరీశ్ రావు దిగ్భ్రాంతి

షార్ట్స్‌లో చూడండి
తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు  చెందిన పదిమంది అయ్యప్పభక్తులు దుర్మరణం చెందిన ఘటనపై టీఆర్ఎస్ నేత హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుదుకోట్టై కలెక్టర్ కు ఆయన ఫోన్ చేశారు. మృతదేహాలు స్వస్థలాలకు చేరేలా ఏర్పాట్లు చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.  

కాగా, ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే తెలంగాణ అధికారులు తమిళనాడు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పుదుకొట్టై జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. 
Go Back to Shorts
Tamilnadu
pudukottai

More Telugu News