‘విశ్వాసం’ పోస్టర్ ని చింపడంతో వివాదం.. అజిత్ అభిమానుల అరెస్టు!
- ఈ నెల 10న విడుదల కానున్న ‘విశ్వాసం’
- కొడువిలర్పట్ లో ‘విశ్వాసం’ పోస్టర్ ను చింపేసిన వైనం
- ఇంటి యజమానిపై అజిత్ అభిమానుల దాడి
దీంతో ఆ పోస్టర్ ను అతికించిన ప్రదేశంలో నివసిస్తున్న ఇంటి యజమాని జయమణికి, అభిమానులకి మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా సదరు యజమానిని అజిత్ అభిమానులు తీవ్ర దుర్భాషలాడారు. చివరకు, జయమణిని చంపుతామని బెదిరించారు. దీంతో, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఈమేరకు జయమణి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అజిత్ అభిమానులు బాలమురుగన్, అజిత్ కుమార్, సతీశ్వరన్, విజయ్, సెల్వకుమార్ తో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.