పొత్తులతో నష్టపోయాం..నల్గొండ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- టీడీపీకి నామమాత్రపు కేడరే ఉంది
- టీడీపీతో పొత్తుతో ఉద్యోగులు, యువత దూరమయ్యారు
- టీఆర్ఎస్ చెప్పిన మాటలు ప్రజలు నమ్మారు
కాంగ్రెస్ పార్టీ కనీసం 45 సీట్లు గెలుస్తుందని ఊహించాం కానీ, పొత్తుల వల్ల ఘోరంగా ఓడిపోయామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు వద్దని చెప్పానని, పొత్తులు లేకుంటే 7 పార్లమెంట్ సీట్లు తామే గెలుస్తామన్న విషయాన్ని పార్టీ అగ్రనేతలకు చెప్పానన్న కోమటిరెడ్డి, నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.