prajarajyam: ప్రజారాజ్యం అనుభవాలతో జనసేనను తీర్చిదిద్దుతున్నా: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
ప్రజారాజ్యం పార్టీ ఉన్న సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జనసేనను తీర్చిదిద్దుతున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. విజయవాడలో తూర్పుగోదావరి జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉందని... తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు వచ్చే సలహాలు ఇవ్వాలని కోరారు. వ్యక్తిగతంగా 10 వేల ఓట్లను తెచ్చుకోగల సామర్థ్యం ఉన్న నేతలను జనసేన అక్కున చేర్చుకుంటుందని చెప్పారు. మన సమాజం అనేక కులాలతో ముడిపడి ఉందని... అన్ని కులాలను కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు.
Go Back to Shorts
prajarajyam
janasena
Pawan Kalyan

More Telugu News