గోల్కొండ సెవెన్ టూంబ్ డెక్కన్ పార్క్ సమీపంలో యువకుడి దారుణ హత్య
- స్థానికంగా కలకలం రేపిన ఘటన
- ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటున్న తండ్రి
- పోలీసుల నిర్లక్ష్యం వల్లే తన కొడుకు చనిపోయాడని ఆరోపణ
మృతుని తండ్రి ఫజిల్ మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం ఫరీద్ అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చి తన కొడుకు సొహైల్‌ను బైక్‌పై తీసుకువెళ్లాడని, ఆ తర్వాత ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. తన కొడుకును తీసుకువెళ్లిన వెంటనే కీడును శంకించిన తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదన్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు హత్యకు గురయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.