మేం ఏ మతానికీ వ్యతిరేకం కాదు.. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో అడ్డుకుంటాం!: సుజనా చౌదరి
- ఈ బిల్లును బీజేపీ దౌర్జన్యంగా పాస్ చేసింది
- దీన్ని ముందుగా సెలక్ట్ కమిటీకి పంపాలి
- ఢిల్లీలో టీడీపీ నేతల మీడియా సమావేశం
పార్లమెంటును ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావిస్తామనీ, కానీ బీజేపీ ప్రభుత్వ హయాంలో అది కనుమరుగయిందని విమర్శించారు. ట్రిపుల్ తలాక్ విషయంలో టీడీపీ విప్ జారీచేసిందని తెలిపారు. తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లును అప్రజాస్వామిక విధానంలో లోక్ సభలో బీజేపీ పాస్ చేసిందని దుయ్యబట్టారు. ఈ బిల్లును పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు.