పశ్చిమ గోదావరి జిల్లాకు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటి?: మాణిక్యాలరావు సూటి ప్రశ్న

  • ఏపీలో అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది
  • పశ్చిమగోదావరి జిల్లాకు అన్యాయం చేశారు
  • సీఎం చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలి
ఏపీలో అభివృద్ధిని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారని బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. ఏలూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో పశ్చిమగోదావరి జిల్లాకు అన్యాయం చేశారని, ఈ జిల్లాకు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ జిల్లాను చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, గత ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు టీడీపీకి పట్టం కట్టినా ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు.
Go Back to Shorts
West Godavari District
bjp
manikyala rao
Telugudesam
Chandrababu

More Telugu News