నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడన ద్రోణి
- నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వర్ష సూచన
- ఉత్తరాది నుంచి పెరిగిన చలిగాలుల ప్రభావం
- పగటిపూట కూడా తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి
రానున్న రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తరాదిలో చలి తీవ్రత పెరగడం, అటు నుంచి వీస్తున్న గాలుల ప్రభావం కూడా కోస్తాంధ్రలో చలి తీవ్రత అధికంగా ఉండడానికి కారణమని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో శని, ఆదివారం పొడి వాతావరణం ఉంటుంది. ఇటీవలే పెథాయ్ తుపాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికించి వెళ్లింది. వరి కోతల సమయంలో గాలులు, వర్షాలు విరుచుకుపడడంతో అన్నదాతకు తీవ్రనష్టం వాటిల్లింది. రెండు రోజుల నుంచి ఎండ కాస్తుండడంతో రైతులు కాస్తంత ఊపిరి పీల్చుకుంటున్నారు.