ప్రజాసంకల్పయాత్రలో నడుస్తూనే ‘యాత్ర’ సినిమా టీజర్ చూసిన జగన్.. వైరల్ గా మారిన వీడియో!
- శ్రీకాకుళం జిల్లాలో జగన్ పాదయాత్ర
- వైఎస్ పాత్రలో నటించిన మమ్ముట్టి
- 2019, ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు
రోడ్డుపై నడుస్తూనే హెడ్ ఫోన్స్ పెట్టుకుని యాత్ర టీజర్ ను ట్యాబ్ ద్వారా వీక్షించారు. యాత్ర సినిమాలో వైఎస్ పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా, యాత్ర సినిమా టీజర్ ను జగన్ వీక్షిస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. దీన్ని మీరూ చూసేయండి.